రాప్తాడు 'ధైర్య' బాలికకు అండగా ఆనంద్ మహీంద్రా

రాప్తాడు ఘటనలో ధైర్యాన్ని చూపిన బాలిక చదువుకు సాయం చేస్తానని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. 'బాలిక కుటుంబం పేదరికంతో ఇబ్బందిపడుతోంది. ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంది. సాయం చేయండి' అని ఓ నెటిజన్ కోరగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. తన ప్రాణానికి ముప్పు ఉన్నా స్నేహితురాలిని కాపాడేందుకు ఆమె ప్రయత్నించిందన్నారు.
ఇదీ చదవండి :: విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్లపై గుర్తులు తారుమారు!











